ప్రజాశక్తి-నూజివీడు టౌన్ (ఏలూరు) : ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్ లో ప్రారంభం నుండి పెండింగ్ లో ఉన్న ఎస్‌టిపి నీటిని తొలగించడానికి పైపులైను పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయమై ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్ నిర్దేశకులు ఆచార్య ఎస్.అమరేంద్ర కుమార్ క్యాంపస్ నుండి ఎస్‌టిపి నీటిని తొలగించడానికి పైప్‌లైన్ నిర్మాణం కోసం నూజివీడు మునిసిపాలిటీతో ఎంఒయు శుక్రవారం సంతకం చేశారు. దీనికి సంబంధించిన పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇది జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
