రాయలసీమ జోన్ అధ్యక్షులుగా పి.జే. రామసుబ్బారెడ్డి

Apr 15,2025 18:32 #Kadapa

ప్రజాశక్తి – కడప :   పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాయలసీమ జోన్( కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం) అధ్యక్షులుగా వైయస్సార్ జిల్లా కడప వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఎం పి హెచ్ ఈ ఓ గా పని చేస్తున్న పి.జె. రామ సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడపలో జరిగిన వైద్య ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంబారపు అహరోన్ సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో పి.జె. రామసుబ్బారెడ్డి రాయలసీమ జోన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీకే సాగర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీ.జే. రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ జోనల్ ఉద్యోగుల సమస్యలపై, ఫీల్డ్ సిబ్బంది ఎఫ్ ఆర్ ఎస్ రద్దు పై చొరవ చూపుతానమ్మన్నారు. ఉద్యోగుల, సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని రామ సుబ్బారెడ్డి తెలిపారు.

➡️