మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి మున్సిపాలిటీని దశలు వారీగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ తెలిపారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌, కౌన్సిల్‌ సభ్యులు,కో ఆప్షన్ల సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గఫార్‌ మాట్లాడుతూ దశల వారీగా మరియు ప్రణాళిక బద్ధంగా మున్సిపాలిటీని అభివద్ధి చేసుకోవాలన్నారు. అందుకు ప్రణాళికలు తయారు చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు.కౌన్సిల్‌ ఏర్పడిన తర్వాత కోవిడ్‌ కారణంగా మరి ఇతర కారణాల కారణంగా కొన్ని పనులు పూర్తి కాలేదన్నారు. వాటిని గుర్తించి త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రంగరావు,వైస్‌ చైర్‌పర్సన్‌ రాచపూడి మాణిక్యరావు, కౌన్సిలర్లు రామనబోయిన ప్రశాంతి శ్రీనివాస్‌,వేల్పుల వెంకటేశ్వర్లు, పెన్నా ఏడుకొండలు, నక్కా రామకష్ణ, ఎర్రబల్లి దేవరాజ్‌, పోతిరెడ్డి రాజా, జాస్మిన్‌ ఆజాద్‌, దాసరి మురళి, ఖాలక్‌ రిజ్వానా, దేవకి రాజీవ్‌, దేవకి రాజేష్‌, షేక్‌ ఖాసింసా, చింతం శ్రీనివాసులు, షేక్‌ ఖాజా పాల్గొన్నారు.

➡️