ప్రజాశక్తి-గంపలగూడెం (ఎన్‌టిఆర్) : పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుతున్నట్లు గంపలగూడెం ఉపాధి హామీ పనుల ఫీల్డ్ అసిస్టెంట్ మధు తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డ్ సమీపన ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు కంపచెట్లను తొలగిస్తున్నారు. కంప తొలగింపు అనంతరం నీడ నిచ్చే చెట్లు నాటుతామని చెప్పారు. దీనివల్ల నీడతోపాటు పర్యావరణం పెంపొందుతుందని, తద్వారా ప్రజా ఆరోగ్యానికి మంచిదన్నారు.