ప్రారంభిస్తున్న నాయకులుక్రీడాకారులు పథకాలు సాధించాలి ప్రజాశక్తి-కోవూరు:కోవూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్‌లో రాష్ట్ర స్థాయిలో జరిగే బాక్సింగ్ పోటీలకు జిల్లా స్థాయి క్రీడాకారులు సెలెక్షన్స్ సోమవారం జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవూరు మాజీ జెడ్‌పిటిసి సభ్యులు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమన్నారు.క్రీడలు విద్యార్థులకు మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తాయన్నారు. 120 కోట్ల మంది జనం ఉన్నప్పటికి ఒలంపిక్స్ లాంటి గేమ్స్ లో మనం ఎక్కువ పథకాలు సాధించలేక పోతున్నామన్నారు.మన దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేకపోవడం కూడా దీనికి ఒక కారణం కావున క్రికెట్ తో పాటు అన్నిరకాల క్రీడలను పైన రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక్కడ జిల్లా స్థాయి బాక్సింగ్ క్రీడాకారులు ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు నవంబర్‌లో కృష్ణాజిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఇక్కడఎంపికైన క్రీడాకారులు బాగా ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో సత్తా చాటి ఎక్కువ పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా ఇక్కడ పీడీగా పనిచేస్తున్న దేవిక క్రీడల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పాఠశాల నుండి మంచి క్రీడాకారులను తయారు చేస్తున్నారు.వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.బాక్సింగ్ క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారికి కూడా అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా నవంబర్‌లో రాష్ట్ర స్థాయిలో జరిగే బాక్సింగ్ పోటీలకు 13 మంది అమ్మాయిలు,13 మంది అబ్బాయిలను ఎంపిక చేశారు.కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీహరి, మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ శివుని నరసింహా రెడ్డి, విద్యా కమిటీ ఛైర్మెన్ షాహినా,చెంచులక్ష్మి, ఝాన్సి రాణి,జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి చేజర్ల కృష్ణారెడ్డి, పీడీ లు దేవిక, సివాజ్ అహ్మద్, రమణయ్య, పుల్లమ్మ, రేణుక, అరోర, కల్పన కుమార్ పిఇటిలు పాల్గొన్నారు.