పుష్కలంగా ఇసుక నిల్వలు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. జిల్లాలోని 10 ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక లభ్యత గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర లభిస్తోంది. లభ్యతకు తగిన డిమాండ్‌ ఉండడం లేదు. సామాన్యులకు అవసరమైన ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నాం. ఇసుక అక్రమ రవాణా నిరోధంపై దృష్టి సారించాం. పోలీసులు, రెవెన్యూ, మైన్స్‌ తనిఖీ అధికారులకు డెలిగేషన్‌ అధికారా లివ్వడమైంది.ఎక్కడై నా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ పట్టబడిన వారిపై కేసు లు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొంటున్న మైన్స్‌ డిడి సి.హెచ్‌.సూర్యచంద్రరావుతో ముఖాముఖి..ఇసుక రీచ్‌ల వివరాలు తెలపండి? జిల్లాలో 10 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. పైడికాల్వ, మాచనూరు, కొత్తగంగిరెడ్డిపల్లి, నందిమండలం, తంగేడుపల్లి, కొండూరు, విభరాపురం, మారెళ్లమడక, గొల్లపల్లి, బెడుదూరు రీచ్‌లు ఉన్నాయి. ఏడు అదనపు రీచ్‌లు పబ్లిక్‌ హియరింగ్‌ దశలో ఉన్నాయి. జిల్లాలో ఇసుక లభ్యత ఎంత? జిల్లాలోని 10 ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక పుష్కలంగా లభిస్తోంది. ప్రతి రోజూ సుమారు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల మేరకు లభిస్తోంది. ఇసుక లభ్యతకు తగిన విధంగా సరఫరా ఉండడం లేదు.10 లక్షల టన్నులకు రెండు వేల టన్నుల మేర మాత్రమే గిరాకీ లభిస్తోంది.డీసిల్టేషన్‌ పాయింట్ల వివరాలు తెలపండి? జిల్లాలోని 10 ఇసుక రీచ్‌ల్లో ఏటూరు, పి.అనంతపురం రీచ్‌ల దగ్గర డీసిల్టేషన్‌ పాయింట్లను ఏర్పాటు చేయడమైంది. ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు ఇసుకను సరఫరా చేయడం జరుగుతుంది.ఇసుక అక్రమ రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నివారణపై దృష్టి సారించాం. పోలీస్‌, రెవెన్యూ, మైన్స్‌ అధికారులకు ప్రత్యేక అధికారులు ఇవ్వడమైంది.జిల్లాలోని క్వారీలు వివరాలు తెలపండి? జిల్లాలో 14 మేజర్‌, 130 మైనర్‌ క్యారీలు ఉన్నాయి. ప్రతి ఏటా లీజుల గడువు ముగిసిన క్వారీల నిర్వాహకులు రెన్యువల్‌ చేసు కోవాల్సి ఉంది.మైనింగ్‌ ఆదాయం వివరాలు తెలపండి? జిల్లా మైనింగ్‌ డిపార్టుమెంట్‌ రూ.241 కోట్ల మేరకు ఆదాయాన్ని ఆర్జించాల్సి ఉంది. ఈనెలాఖరు నాటికి పూర్తి ఆదాయం వివరాలను వెల్లడించడం జరుగుతుంది.

➡️