ప్రజాశక్తి- రాజోలు (కోనసీమ) : పారాలీగల్ వాలంటీర్లు గ్రామాల్లో ప్రజలకు చట్టపరమైన, న్యాయ పరమైన సహాయ, సహకారాలు అందిచాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి పి.ప్రమీల రాణి అన్నారు.ఇటీవల రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో శిక్షణ పొందిన పారా లీగల్ వాలంటీర్లకు శనివారం గుర్తింపు కార్డులు,బ్యాడ్జీ లు అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్లు గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దఅష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కఅషి చేయాలని అన్నారు.న్యాయ వ్యవస్థ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, న్యాయ సందేహాలు నివఅత్తి చేయాలని, చట్టపరమైన, న్యాయపరమైన కేసులు సత్వర పరిష్కారం చేసుకునే దిశగా వారిని చైతన్య వంతులు చేయాలని తెలిపారు.
డిసెంబర్ 14 న జాతీయ లోక్ అదాలత్
డిసెంబర్ 14 వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ లో వీలైనంత ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కఅషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి ప్రమీల రాణి బార్ అసోసియేషన్ సభ్యులను కోరారు. సివిల్,బి.ఎస్.ఎన్. ఎల్, బ్యాంకు కేసులతో పాటు పరిష్కరించదగ్గ క్రిమినల్ కేసులు రాజీ చేసుకునేలా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. స్టాలిన్, జాలెం భాస్కర రావు, ఆచంట శ్రీనివాస్, వై.ఎస్ .ఎస్.అయ్యప్ప నాయుడు,జి.రజిత,జి. పద్మావతి, రామ్ కుమార్,జగదీష్ నాయుడు, సిర్రా వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.