‘పిఎం ఇంటర్న్‌షిప్‌’ యువతకు సువర్ణావకాశం

ప్రజాశక్తి – రాయచోటి ఎపి, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం ద్వారా యువతకు ఉత్తమమైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి పేర్కొన్నారు. పథకం ద్వారా యువతకు ప్రతిష్టాత్మక కంపెనీల్లో పని అనుభవం, నైపుణ్యాభివద్ధి, ఆర్థిక సహాయం లభిస్తుందిన్నారు. ఇంటర్న్‌షిప్‌ చేయడానికి టాప్‌ 500 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. 6- 12 నెలల ఇంటర్న్‌షిప్‌ ప్రాక్టికల్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి వన్‌టైమ్‌ గ్రాంట్‌ రూ.6 వేలు, ప్రతి నెలా రూ.4,500 కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.500, సిఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ఆర్థిక సాయం మొత్తం రూ.5 వేలు అందుతుందని తెలిపారు. ప్రధానమంత్రి జీవిత బీమా యోజన, ప్రధానమంత్రి ప్రమాద బీమా యోజన వర్తిస్తుందని తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 24 సంవత్సరాలు, పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, ఐటిఐ, పాలిటెక్నిక్‌, బిఎ, బిఎస్‌సి, బికాం, బిసిఎ, బిబిఎ, బి.ఫార్మసి, బి.టెక్‌ వంటి డిగ్రీలు పూర్తి చేసిన వారు, చివరి సెమిస్టర్‌ చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఐఐటి, ఐఐఎంఎస్‌, నేషనల్‌ లా యూనివర్సిటీలు, ఐఐఎస్‌ఇఆర్‌, ఎన్‌ఐడి, ఐఐటి నుంచి పట్టభద్రులైన వారు, సిఎ, సిఎంఎ, సిఎస్‌, ఎంబిబిఎస్‌, బిడిఎస్‌, ఎంబిఎ లేదా మాస్టర్స్‌ లేదా అంతకంటే ఉన్నతమైన అర్హులని తెలిపారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ను ష్ట్ర్‌్‌జూర:// జూఎఱఅ్‌వతీఅరష్ట్రఱజూ.ఎషa.స్త్రశీఙ.ఱఅ/శ్రీశీస్త్రఱఅ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ సత్య నారాయణ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి నాగార్జున పాల్గొన్నారు.జాతీయ రహదారి మాసోత్సవాలను విజయవంతం చేయాలి : ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జిల్లాలో నిర్వహించే జాతీయ రహదారి మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో ‘జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు – 2025’ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లు, బుక్‌లెట్లు, బ్రోచర్లను కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే జాతీయ భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ రహదారిపై భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ, ఎంవిఐ, డిఎంహెచ్‌ఒ కొండయ్య పాల్గొన్నారు.

➡️