ప్రజాశక్తి- అరకులోయ: వచ్చే నెల రెండో తేదీన అరకు వ్యాలీ మండలం పకనకుడి గ్రామంలో ప్రధానమంత్రి జన్‌మన్ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి .అభిషేక్ స్పష్టం చేశారు. మంగళవారం కేంద్ర గిరిజన సంక్షేమ వ్యవహారాల శాఖ సెక్రెటరీ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. స్థానిక గిరిజన మహిళ స్వాభి గంగతో కలిసి పీఎం జన్‌మన్ కార్యక్రమం నిర్వహణపై అరకు వ్యాలీ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ, అరకు వ్యాలీ నుండి స్వాబి గంగ జార్ఖండ్ వెళ్లి ప్రధానమంత్రి తో ముచ్చటిస్తారన్నారు. గత జనవరిలో జరిగిన ప్రధానమంత్రి జన్‌మన్ కార్యక్రమం నిర్వహణపై తయారుచేసిన ఆల్బమ్‌ను ప్రధానమంత్రికి బహుకరిస్తారన్నారు. విడివికే స్టాల్‌ను ఏర్పాటు చేస్తారని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. కార్యక్రమంలో మ్యూజియం మేనేజర్ మురళి, సిబ్బంది గణపతి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఐటిడిఎ పిఒ అభిషేక్