పద్యకవి జలకనూరికి ఘన సత్కారం

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పీలేరు వాసి, పద్యకవి జలకనూరి మురళీధర్‌ రాజుకు ఘన సత్కారం లభించింది. వైయస్సార్‌ జిల్లా రచయితల సంఘం పిలుపు మేరకు కడప, శంకరాపురంలోని ఐయంఏ హాలులో ఫిబ్రవరి 8,9 తేదీల్లో రెండు రోజుల పాటు ”వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం – రాయలసీమ భాగస్వామ్యం” సాహిత్య, సంస్కఅతిలో రాయలసీమ వైభవం అనే అంశాలపై కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పీలేరుకు చెందిన జలకనూరి మురళీధర్‌ రాజు రాయలసీమ, కవులు, భాష, యాస, పండుగలు, ఆచార వ్యవహారాలు, శాసనాలు, స్వాతంత్య్ర సమరయోధులు కళాకారులు, శ్రామిక జీవన విధానాలపై ”నా రాయల సీమ రతనాల సీమ” అనే పద్యాన్ని పద్య గానంతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. అలాగే రాయల సీమ కవులు, శ్రీ కఅష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన, నాచన సోమన, అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం మొదలగు వారిపై ఆట వెలది, కందము, సీస పద్యాలు రాసి వినిపించారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు, కవులు జింకా సుబ్రమణ్యం, అధ్యక్షులు మూల మల్లికార్జున్‌ రెడ్డి, ఆచార్య వెలుగొంద నిత్యానందరావు, గానుగ పెంట హనుమంతరావు చేతుల మీదుగా శాలువా సన్మానించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని నాకు తెలిసి సత్కరించారు.

➡️