ప్రజాశక్తి-పల్నాడు : కవయిత్రి మొల్ల మాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక హాలులో కవియిత్రి మొల్ల జయంతిని ఘనంగా నిర్వహించారు. కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసి ఉందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప కవయిత్రి అని కొనియాడారు. ఆనాటి పరిస్థితులను ఎదుర్కొని సాహసోపేతంగా రామాయణం రచించారని అన్నారు. మారుమూల ప్రాంతం నుండి నుండి వచ్చిన కవియత్రి అని ఆమె పేరుతో ప్రభుత్వం స్టాంప్ కూడా రిలీజ్ చేసిందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కుమ్మరి నాయకుల కోరిన విధంగా ప్రభుత్వ నియమ నిబంధన అనుసరించి మట్టిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారిని కోరారు. మట్టిని ఎవరు తీసుకెళ్తున్నారు అనేదానిపై నిగా ఉంచాలని అన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , జిల్లా రెవిన్యూ అధికారి మురళి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు పలువురు సంఘ నాయకులు శ్రీనివాసులు, బసవేశ్వర రావు, వెంకయ్య, వెంకటేశ్వర్లు, మంగమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు.
