ప్రజాశక్తి-నూజివీడు టౌన్ (ఏలూరు) : నూజివీడు పట్టణంలో మంగళవారం అక్రమంగా తరలిస్తున్న గోవులను గుర్తించి పోలీసులు వాటిని అదుపులోకి తీసుకున్నారు. మైలవరం సమీపంలోని చంద్రాల గ్రామంలో నుండి నంద్యాలకు గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ రాధాకృష్ణ, హౌంగార్డ్ వెంకటేశ్వరరావులు స్థానిక పెద్దగాని బొమ్మ సెంటర్ వద్ద గోవులు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టణ సిఐ సత్య శ్రీనివాస్ గోవుల అక్రమ తరలింపు పై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.