టిడిపితో పోలీసులు కుమ్మక్కు: అంబటి

May 15,2024 00:39

ప్రజాశక్తి సత్తెనపల్లి టౌన్‌ : ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలను పరిరక్షిం చాల్సిన పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, కొందరు పోలీస్‌ అధికారులు టిడిపితో కుమ్మక్కయ్యారని వైసిపి సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ఆరోపిం చారు. స్థానిక వైసిపి కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలో వైసిపి నాయకులపై టిడిపి వారు దాడులు చేస్తున్నారని పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన పట్టించుకో లేదన్నారు. రూరల్‌ సిఐ రాంబాబు అయితే చాలా దురు సుగా ప్రవరించారని, నియోజకవర్గంలో తనను పర్యటించ వద్దంటూ గృహ నిర్బంధంలో ఉంచారని అన్నారు. మరోవైపు టిడిపి అభ్యర్థి కన్నా లకీëనారాయణ మాత్రం నియోజకవర్గంలోని పోలింగు కేంద్రాలను పరిశీలించడం తనను ఆశ్చర్యానికి గురించేసింన్నారు. నియోజకవర్గంలో జరిగిన దాడుల్లో పోలీసుల వైఫ్యలం తేటతెల్లమైందని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఘర్షణలు జరుగుతున్నప్పుడు రూరల్‌ సిఐ ఫోన్‌చేస్తే అంతా అయిపోయాక వెళ్లటం సినిమాను తలపించిందన్నారు. టిడిపి నాయకుడు కన్నా నాగరాజుతో రూరల్‌ సిఐ కుమ్మక్కుయ్యి వారికి అనుకూలంగా పనిచేసారని ఆరోపించారు. నార్నెపాడులో చీఫ్‌ పోలింగ్‌ ఏజెంట్‌ ఉన్న తన అల్లుడు ఊపేష్‌పై దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటం ఏమిటని ప్రశ్నించారు. ఘర్షణలలో గాయాల పాలైన వారు తనకు ఫోన్‌ చేస్తుంటే మంత్రిగా ఉండి తానేమీ చేయలేక పోయానని అన్నారు. చాగాంటివారిపాలెంలో ఓటర్లను టిడిపి నాయకులు కన్నా నాగరాజు బెదిరిస్తున్నారనే సమాచారం తనకు తెలిసిన వెంటనే రూరల్‌ సిఐకు ఫోన్‌ చేయగా అనుచితంగా మాట్లాడరని చెప్పారు. డీఎస్పీ అయితే పట్టించుకోలేదని, దీంతో తానే ఘటనా స్టలికి వెళ్లగా కన్నాకు అనుకూలంగా వ్యవహారిస్తూ తనను బయటకు పంపే ప్రయత్నం చేశారని విమర్శించారు. దమ్మాలపాడు, నార్నెపాడు, చీమలమర్రి గ్రామాల్లో రిపోలింగ్‌ జరపాలని, దీనిపై ఎన్నికల అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు.

➡️