పలు గ్రామల్లో పోలీసు కవాతు

Jun 11,2024 18:59
పోలీసులు కవాతు

కవాతు నిర్వహిస్తున్న పోలీసులు
కవాతు నిర్వహిస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-నెల్లూరు : ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా చేసుకోని ఎస్‌పి కె.ఆరీఫ్‌ హఫీజ్‌ ఆదేశానుసారం జిల్లాలోని పలు గ్రామాలలో కేంద్ర సాయుధబలగాలు(సిఆర్‌పి), స్థానిక పోలీస్‌ అధికారులు సిబ్బందితో కలిసి ఫ్లాగ్‌ మార్చ్‌(పోలీసు కవాతు) నిర్వ హించారు.శాంతిభద్రతలు పరిరక్షణే ద్యేయంగా సమస్యాత్మక ప్రాంతాలలో ప్రధాన రహదారులు, కూడళ్లలో పోలీసు కవాతను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం డిఎస్‌పి, స్థానిక సిఐల పర్య వేక్షణలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా యువత అల్లరు, ఘర్షణ, వివాదాలకు దూరంగా ఉండాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ జీవించాలన్న ఆలోచనతో కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

➡️