ప్రజాశక్తి-అమలాపురం రూరల్ (కోనసీమ) : భద్రత నియమాలు పాటించాలని కోరుతూ … ఆటో డ్రైవర్లతో కలిసి అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురం ఎర్ర వంతెన వద్ద పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అమలాపురం పట్నం ఎర్ర వంతెన నుండి మొదలైన ఈ ర్యాలీ ” ఒకసారి ఆలోచించండి. మీకోసం కాదు. మీ కుటుంబ సభ్యుల కోసం. ” అనే నినాదంతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ ఎస్సై శేఖర్ బాబు, ఆటో యూనియన్ నాయకులు బంతు బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.