పొదిలి (ప్రకాశం) : సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లిఖార్జున్‌రావు ఆధ్వర్యంలో సోమవారం పొదిలిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి టైలర్స్ కాలనీలో ఆకస్మిక సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల దఅష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పొలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది. ఈ క్రమంలో పొదిలి టైలర్స్ కాలనీలో కార్బన్ సర్చ్ నిర్వహించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా ? మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలలో ప్రస్తుతానికి సరైన పత్రాలు లేని 26 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు మల్లిఖార్జున్ రావు తెలిపారు. శాంతి, భద్రతల పట్ల ప్రత్యేక దఅష్టి సారించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ సోదాలలో పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు ఎస్సైలు పాల్గొన్నారు.
