పోలియో నిర్మూలన అందరి బాధ్యత : జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

Mar 3,2024 16:28 #chitoor, #Pulse Polio

ప్రజాశక్తి-వి కోట(చిత్తూరు) : పోలియో నిర్మూలన సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. మండల కేంద్రమైన వీకోటలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని నివారించవచ్చని వారు సూచించారు. ప్రభుత్వాలు ముమ్మరంగా పోలియో వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపడుతొందని ప్రతి ఒక్క తల్లి తమ బిడ్డలకు చుట్టుపక్కల పిల్లలకు పోలియో చుక్కలు వేయించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. పోలియో చుక్కలు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరోగ్య సిబ్బందికి ప్రజాప్రతినిదులు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు.

➡️