ప్రారంభిస్తున్న సన్నారెడ్డిసౌరశక్తితో కాలుష్యం తగ్గుదలప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :సౌర (సోలార్) శక్తిని ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతమేరకు తగ్గించవచ్చని టీడీపీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవ ర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు ఎస్.ఇ.ఐ.ఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ తోటపల్లిగూడూరు మండలం, వరకవిపూడి గ్రామ పంచాయతీకి సోలార్ విద్యుత్ లైట్లను మంజూరు చేసింది. సోమవారం సోలార్ విద్యుత్ లైట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భం గా సురేష్ రెడ్డి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఎనర్జీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. సౌరశక్తి అనేది పునరుత్పాదక, తరగని, సరసమైన శ క్తి రూపమని పేర్కొన్నారు. సోలార్‌లో రెండు రకాల సౌర పరికరాలు ఉన్నాయన్నారు. సౌరశక్తిని ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యా న్ని కొంత మేర తగ్గించవచ్చని తెలిపారు. తక్కువ ఖర్చుతో కూడుకున్న సోలార్ లైట్లు ఉపయోగం తో విద్యుత్ బిల్లులను 90 శాతం వరకు తగ్గించవచ్చని చెప్పారు. సూర్యరశ్మి ఎక్కువగా వచ్చే ప్రదేశాల లో, సౌరశక్తిని ఉపయోగించడం చాలా ముఖ్యమన్నా రు. ప్రస్తుతం సోలార్ లైట్లు వంటి సౌరశక్తితో పనిచేసే పరిష్కారాలు పెద్ద పాత్ర పోషిస్తున్నాయన్నారు. పర్యావర ణానికి అనుకూలమైన రోడ్డు లైటింగ్‌లో సోలార్ ఎనర్జీ ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. సోలార్ లైట్లు డబ్బును ఆదా చేయడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా వీధులను ప్రకాశవంతం చేస్తాయన్నారు. అనంతరం ఎస్.ఇ.ఐ.ఎల్ ఎనర్జీ మంజూరు చేసిన 87 సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమంలో టి డిపి నాయకులు వేనాటి జితేందర్ రెడ్డి, ముసలి నాగరాజు, వేలపాలెం ద్రువకుమార్ రెడ్డి, నెల్లిపూడి సుధాకర్, వెలసరి కోటేశ్వరరావు, నాగరాజు, గూడూరు భాస్కర్, వక్కలాకుల రమేష్, కామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్త లు, గ్రామస్తులు పాల్గొన్నారు.