భారతదేశ ఆధునిక యుగ వైతాళికుడు పూలే

Nov 28,2024 15:32 #Kakinada, #mahatma jyotirao phule

తాళ్లరేవులో ప్రజాసంఘాల ఘన నివాళి

ప్రజాశక్తి – తాళ్లరేవు : తాళ్లరేవులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె వి పి ఎస్ మండల అధ్యక్షుడు విప్పర్తి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న ఫూలే జన్మించారని తెలిపారు. 13వ ఏట సావిత్రిబాయి తో వివాహం జరిగిందన్నారు. జ్యోతిబా తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్ళి ఊరేగింపు లో పాల్గొన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అవమానంతో తన జీవితం మలుపు తిరిగిందని గుర్తు చేశారు. కులం పేరుతో తరతరాలుగా అన్నిరకాలుగా అణచివేతలకు వివక్షతకు గురైన బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతి రావు ఫూలే అన్నారు. శతాబ్దాలుగా అణచి వేయబడుతున్న కింది కులాల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు జ్యోతిరావు ఫూలేనని అన్నారు. సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం అంటూ ఆలోచించి ప్రబోధించి దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి ఆయన అని కొనియాడారు. 1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి వితంతువుల గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచారన్నారు. అలాంటి మహోన్నతుని ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు, ముమ్మిడివరం మార్కెట్ కమిటి ఛైర్మన్ కుడుపూడి శివన్నారణ, మాజీ ఛైర్మన్ వుంగరాల వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోర్త రాజశేఖర్, వల్లు రాజబాబు, వ్యవసాయ శాఖ రిటైర్డ్ జె.డి. పెట్ల సూర్యనారాయణ రాజు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అత్తిలి బాబూరావు, బొంతు శ్రీనివాస్, బిటిఎ నాయకులు ఎలిపే నాగేశ్వరరావు, వి.ఓ.ఎ.ల సంఘం అధ్యక్షులు కమిడి ఈశ్వరీబాయి, మాజీ సర్పంచి బర్రే లక్ష్మీనరసిహరాజు, మాజీ ఎంపిటిసి సభ్యులు బొంతు మోహన్, మల్లాడి వరదరాజు, కడలి శ్రీను, చెక్కా ఆదినారాయణ, దున్న మురళి, కుడిపూడి మల్లేష్, పూలే అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు,వెదురుపావులూరి నాని, పాలిక శ్రీనివాస్, దుప్పి అదృష్టదీపుడు తదితరులు పాల్గొన్నారు.

➡️