పూలే గొప్ప సామాజిక ఉద్యమకారుడు

Nov 28,2024 18:08 #pule

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నవ్యాంధ్ర ప్రజా గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 143వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమ నేత జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి రత్నాల బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలంతా అసమానతల్లేని, కులమత బేధాల్లేని, దోపిడీ, పీడనలేని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని, మూఢనమ్మకాలు పారద్రోలాలని సమాజానికి శోధక శక్తులుగా పనిచేసేందుకు పూలే సామాజిక ఉద్యమం చేపట్టారని పేర్కొన్నారు. నవ్యాంధ్ర గ్రంథాలయ అధ్యక్షులు పి.షణ్ముఖరావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతోపాటు అమెరికా రెడ్ ఇండియన్, నల్లజాతీయుల మధ్య జరిగిన అసమానతల విషయంలో పూలే స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా విజయం పార్టీ కార్యదర్శి సిహెచ్ బంగార్రాజు, జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టివి దుర్గారావు, జిల్లా శాతవాహన సంఘం అధ్యక్షులు కె.విశ్వనాథం,జిల్లా యువజన సంఘ నాయకులు గరుగుబిల్లి వినయ్ బాబు,దళిత హక్కుల పోరాట సమితి కార్యదర్శి గరుగుబిల్లి సంతోష్ తదితరు పాల్గొన్నారు.

➡️