గంజాయి స్వాధీనం

Nov 29,2024 00:53 #Ganjai pattivetha
Ganjai pattivetha

 ప్రజాశక్తి -ఉక్కునగరం : దువ్వాడ పోలీసుస్టేషన్‌ పరిధిలో గురువారం వేర్వేరు చోట్ల 235 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పాడేరు నుంచి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగనంపూడి టోల్‌ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న 135 కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు లిక్విడ్‌ గంజాయిని పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జోన్‌ 2 డిసిపి మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. అల్లూరి జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పట్టుకున్నామని చెప్పారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్‌ చేశామని తెలిపారు. గంజాయితో పట్టుబడ్డ ఇద్దరిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు చెప్పారు.మిధిలాపురిలో 100 కిలోలు పట్టివేత దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఫేస్‌ -7 మిధిలాపురి కాలనీలో ఫలారాజ్‌ తమిళ సెల్వి మహిళ వద్ద వంద కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్బీడబ్ల్యూ కేసులో ఒక మహిళను విచారించేందుకు తమిళనాడుకు చెందిన పోలీసులు మీధిలాపురికి చేరుకున్నారు. విచారణలో భాగంగా ఆమె ఇంట్లో 100 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

➡️