కడప బాలోత్సవం పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కడప బాలోత్సవం 2వ పిల్లల పండుగ ఫిబ్రవరి 1,2న సెయింట్‌ జోసెఫ్‌ బాలుర పాఠశాలలో ఉంటుందని కడప బాలోత్సవం అధ్యక్షులు గోపాల్‌ తెలిపారు. శనివారం ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాలలో పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితానికి చదువు చాలా ముఖ్యమే, కానీ పిల్లలు ఒత్తిడితో కాక ఇష్టపడి చదివే వాతావరణం కావాలని పేర్కొన్నారు. వారి అభిరుచులను, ఆసక్తులను, సజనను, జ్ఞాన తష్ణను ప్రోత్సహించే పరిస్థితులు ఉండాలన్నారు. గౌరవాధ్యక్షులు నాగమునిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాకెట్‌ యుగంలో మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు, స్నేహ భావాలు బలహీనపడ్డాయని చెప్పారు. సహకారతత్వం సడులుతోందని, పెద్దవారికి, సాటి వారికి సేవ చేయాలనే భావన కొరవడుతోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు పనుల వత్తిడితో పిల్లలకు మొబైల్‌ ఇవ్వడం ద్వారా చదువులలో వెనుకబడటం, ఆటపాటలు లేక ఊబకాయం రావడం, మత్తు పదార్థాలకు అలవాటు పడటంలాంటివి సర్వసాధా రణమైందన్నారు. ప్రధాన కార్యదర్శి రాహుల్‌ మాట్లాడుతూ చదువులతో కష్టపడే పిల్లలకు బాలోత్సవం ఓ పండుగ, ఒక ఆటవిడుపు, ఒక వేడుక, ఒక మహోత్సవం అన్నారు. పాఠశాలల కలయిక, జీవితాంతం గుర్తుండే సంఘటన, ఇంటి బయట వెళ్లి విరిసే ఆహ్లాదం మన చిన్నారులతోనే కావున కడప బాలోత్సవం ‘రెండవ పిల్లల పండుగ’ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ వీర సుదర్శన్‌ రెడ్డి, నాయకులు బాల ఎల్లారెడ్డి, సత్యనారాయణ, కార్యదర్శులు లక్ష్మీరాజా, వెంకటసుబ్బయ్య, రామకష్ణారెడ్డి, శ్రీనివాసులు, యల్లేశ్వరావు, శివరాం, అరుణ, వెంకటేశ్వర్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు, సుందరయ్య, మధుసూదన్‌, నరసింహారావు హాజరయ్యారు.

➡️