చింతూరు (అల్లూరి) : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ లో చింతూరు ఎడుగురాళ్ళ పల్లి , కాటుకపల్లి లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. ఎక్కువగా మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే ఈసారి మాత్రం పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. మావోయిస్టుల విధానాలను గిరిజన ప్రజలు ప్రశ్నిస్తున్నట్లుగా అక్కడక్కడ పోస్టర్లను గిరిజన అభ్యుదయ సంఘం అంటించింది. ఎవ్వరి కోసం ఈ మావోయిస్టు వారోత్సవాలు ? అన్నలారా అంటూ వారోత్సవాలని, వక్త్రోత్సవాలని మీ ఉచ్చులోకిలాగొద్దు. సభలంటూ సమావేశాలంటూ మమ్ము వేధించొద్దు స్థూపాలు కట్టాలని మీ పాపాల్లో మాకు పాలు పంచొద్దు.. మీ దారికి రావాలని బెదిరించొద్దు మా గిరిజనుల సహనం పరీక్షించొద్దు అన్నలారా అంటూ పోస్టర్లు వెలిశాయి. అంతేకాకుండా గిరిజనులకు ఉపయోగపడని మావోయిస్టు వారోత్సవాలు ఎవరికోసం మాకొద్దు మీ వారోత్సవాలు అని పోస్టర్లు ద్వారా తెలిపారు. అంతేకాకుండా మావోయిస్టుల పార్టీకీ సూటి ప్రశ్నలు వేసినట్లు ఈ పోస్టర్లలో సారాంశం ఉంది. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక ఆదివాసీలను చంపుతున్న నరహంతకులు మీరు కాదా ? మా కోసం వేసే రోడ్డు యంత్రాలను కాల్చడం, మేము తిరిగే బస్సులను ఆపివేయడం మా అభివఅద్ధిని అడ్డుకోవడం మీ నక్సలిజమా ? ప్రజా విప్లవం అంటే విధ్వంసమా ? అదివాసులమైనా మా మద్దతు విధ్వంసానికి కాదు అభివఅద్దికే అంటూ మావోయిస్టుల విధానాలను ప్రశ్నిస్తున్నట్లు పోస్టర్లు వెలిశాయి.
చింతూరు మన్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
