గుంతలు లేని రహదారుల క్యాంపెయిన్ ప్రారంభం

Nov 2,2024 16:33 #anatapuram
  • ఆర్.అండ్.బి రహదారులను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దుతాం
  • జిల్లాలో మొత్తం 68 పనులకు రూ.19.7 కోట్లు మొదటి విడతగా మంజూరు
  • జనవరి 15వ తేదీలోపు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తికి చర్యలు
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

ప్రజాశక్తి – ఉరవకొండ : జిల్లాలో ఆర్.అండ్.బి రహదారులను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్. పేర్కొన్నారు. శనివారం విడపనకల్లు మండలం ఆర్.కొట్టాల గ్రామం వద్ద విడపనకల్లు నుంచి గడేకల్లుకు వెళ్లే రోడ్డుకు సంబంధించి గుంతలు లేని రోడ్ నెట్ వర్క్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గుంతలు లేని రోడ్ నెట్ వర్క్ కార్యక్రమానికి భూమి పూజ చేసి జిల్లా కలెక్టర్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుంతలు లేని రహదారుల క్యాంపెయిన్ ని విడపనకల్లు మండలంలో ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో 8 నియోజకవర్గాలలో కూడా స్థానిక శాసనసభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని గుంతలు లేని రహదారుల క్యాంపెయిన్ ని మొదలు పెడుతున్నారన్నారు. జిల్లాలో మొత్తం 68 పనులకు 19.7 కోట్ల రూపాయలు మొదటి విడతగా మంజూరయిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఈ పనులకు సంబంధించి మంజూరులు వస్తాయన్నారు. జనవరి 15వ తేదీలోపు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్.అండ్.బి రహదారులను గుంతలు లేని రహదారులుగా చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ ఎబివిఎస్బి శ్రీనివాస్, ఎంపీపీ కరణం పుష్పావతి భీమ్ రెడ్డి, జెడ్పిటిసి హనుమంతు, టీడీపీ మండల కన్వీనర్ జి.మారయ్య, ఆర్.అండ్.బి ఎస్ఈ హరిప్రసాద్, ఈఈ రాజగోపాల్, మండల ప్రత్యేక అధికారి వెంకటస్వామి, తహసీల్దార్ సునీత భాయి, ఎంపీడీవో షకీలా భేగం, మండల నాయకులు బోయ హనుమంతు, భీమలింగ, రామాంజనేయులు, సర్పంచులు చంద్రశేఖర్, తిమ్మరాజు, తిప్పారెడ్డి, ఆశాలత, జయసింహ, జనార్ధన్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️