బాలాజీ నగర్ లో ఓటరు జాబితా పరిశీలన

Apr 4,2024 13:05 #Nellore District
Scrutiny of voter list in Balaji Nagar

ప్రజాశక్తి-నెల్లూరు : స్థానిక 15 డివిజన్ పరిధిలో ఆ ప్రాంత సిపిఎం శాఖా సభ్యులు ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. గురువారం బాలాజీ నగర్ 15వ డివిజన్లో 222, 234, 223 నెంబర్ పోలింగ్ కేంద్రాల కన్వీనర్లు డివిజన్ ఇంచార్జి సూర్యనారాయణ, అల్లం పాటి శ్రీనివాసులు రెడ్డి, రమణారెడ్డి, నాగేశ్వరరావు, రాంబాబు, సుబ్బక్క, రెహమక్క, కుమారక్క, నాగలక్ష్మి, నందిని తదితరులు శివ సాయి హోటల్, ఆంధ్రాబ్యాంక్ స్ట్రీట్,మసీదు ఏరియాల్లో ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా నగర నియోజకవర్గానికి సిపిఎం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని, ఆ అభ్యర్థిని కి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.

➡️