ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్”

Jan 9,2025 15:21 #Kadapa, #pradhan mantri

ప్రజాశక్తి – తొండూరు : నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొoడూరు యందు డాక్టర్ రేష్మా  ఆధ్వర్యంలో “ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మండలము లోని ఆన్ని గ్రామాలలో ఉన్న గర్భవతులకు ప్రత్యేక గర్భస్థ పరీక్షలు, హిమోగ్లోబిన్, రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించారు. రక్తం తక్కువ ఉన్న వారికి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు అందించారు. అలాగే స్కానింగ్ ల కొరకు ఉన్నత ఆసుపత్రులకు పంపించారు. రక్త హీనత నివారణ గూర్చి, ఆసుపత్రి ప్రసవాల ప్రాముఖ్యతను గురించి ఆరోగ్య విద్య ద్వారా అవగాహన కల్గించారు. అలాగే రక్త నివారణ కొరకు ఉచితంగా చిక్కీలను గర్భవతులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆరీఫుల్లా, కమ్యూనిటీ ఆరోగ్య అధికారి విజయ, హెల్త్ ఎడ్యుకేటర్ మల్లయ్య,హెల్త్ సూపర్వైజర్ శశికళ, స్టాఫ్ నర్సు అనూష , ఫార్మసీ ఆఫీసర్ ఓబులేసు, ల్యాబ్ టెక్నీషియన్ కుమారి, కమ్యూనిటీ హెల్త్ అధికారిణి లు సోమేశ్వరి, సాయి దివ్య, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️