ప్రజా సమస్యల పరిష్కారానికి ”ప్రజా దర్బార్‌” : ఎమ్మెల్యే సత్యానందరావు

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : అర్హత ఉన్న లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదనే ఉద్దేశంతో ప్రజలతో మమేకమై వారి సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా ”ప్రజా దర్బార్‌ ” వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ”ప్రజా దర్బార్‌” కార్యక్రమం సోమవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజా దర్బార్‌ కు అధిక సంఖ్యలో ప్రజలు రాగా సానుకూలంగా స్పందించి వారి వద్ద నుండి అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుటకు అధికారుల చుట్టూ తిరగనవసరం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవటం వారి హక్కుగా భావించాలని, వ్యయ ప్రయాసలకోర్చి ఎవరి చుట్టూ తిరగకూడదనే దఅడ సంకల్పంతో వారు సులువుగా సంక్షేమ పథకాలను అందిపుచ్చుకునే తమ కూటమి ప్రభుత్వం కఅషి చేస్తున్నదని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో వ్యవహరించి చట్టబద్ధతలేని హామీ పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వటం జరిగిందని ఇందువలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి పండుగ సందర్భంగా ఒక ఉచిత గ్యాస్‌ సిలిండర్ను పంపిణీ చేసే కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు. అర్హత ఉండి ఎవరికైనా ప్రభుత్వ పథకాలను పొందలేని వితంతు వఅద్ధాప్య, ఇండ్ల స్థలాలు, మరి ఏ ఇతర స్థానిక సమస్యలు ఉన్నప్పటికీ లబ్ధిదారులు ఈ ప్రజా దర్బార్‌ వేదిక నందు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ అజెండాగా పనిచేస్తున్నామని, ఇందుకు ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి అభివఅద్ధికి కఅషి చేస్తామని ఆయన అన్నారు. ప్రజా దర్బార్‌ వేదికలో ఇళ్ల స్థలాలు, పిన్షన్లు వంటి వ్యక్తిగత దరఖాస్తులతో పాటు గ్రామాల్లోని రోడ్లు నిర్మాణాలు, చెరువులు చుట్టూ నడక మార్గం వంటి వాటిపై 87 అర్జీలు అందగా వాటిని ఆయా సంబంధిత శాఖ అధికారులకు అందజేసి తక్షణం వాటిని పరిష్కరించవలసిందిగా ఎమ్మెల్యే బండారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.జాన్‌ లింకన్‌, తాహసిల్దార్‌ కె.జె.ప్రకాష్‌ బాబు, ఈవోపీఆర్డీ, ఇంచార్జ్‌ డిఎల్పీఓ ఐ.రాజు, సిఐ సిహెచ్‌.విద్యాసాగర్‌, మండల ప్రజాపరిషత్‌ ఏవో ఎం.మెహర్‌ ప్రకాష్‌, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ పద్మావతి, హౌసింగ్‌ ఏఈ డి.శ్రీనివాస్‌, వ్యవసాయ శాఖ అధికారిని ఎస్‌.లక్ష్మీ లావణ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️