ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : ప్రజల కోసమే ప్రజాశక్తి పత్రిక ఎనలేని కృషి చేస్తుందని ఉరవకొండ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చిన్న గౌస్ పేర్కొన్నారు సోమవారం ఉరవకొండలోని పోలీస్ స్టేషన్ క్రీడా ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ … పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కార్మికుల రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రజాశక్తి పత్రిక కఅషి చేస్తుందన్నారు పత్రిక ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ముందు వరుసలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ ఎస్సై జనార్ధన్ నాయుడు విడపనకల్ మండలం మండల పరిషత్ అడ్మినిస్ట్రేషన్ అధికారి భాస్కర్ సిపిఎం మండల కన్వీనర్ మధుసూదన్, నాయకులు మురళి, సిపిఐ నియోజకవర్గ కన్వీనర్ మల్లికార్జున, వజ్రకరూరు మండల కన్వీనర్ సుల్తాన్, యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రామప్ప చౌదరి, కార్యదర్శి సంజీవ్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి హరుణ్ రషీద్, సప్తగిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సేపక్ తక్రక్రీడా సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున,జై కిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగమల్లి ఓబులేసు, నిస్వార్ధ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకట్, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు గణేష్ బాబు, చాబాల గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మొలకా బాల రామాంజనేయులు, దళిత గిరిజన హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రేణుమాకులపల్లి రమేష్, టిడిపి నాయకులు ఫ్యారం కేశప్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ అబ్బాస్, మండల కార్యదర్శి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
