ప్రకాశం జిల్లా టెన్ని కాయిట్‌ జట్ల ఎంపిక

ప్రజాశక్తి-శింగరాయకొండ : ప్రకాశం జిల్లా టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నాడు శింగరాయకొండ గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో జిల్లా జట్ల ఎంపిక జరిగింది. పురుషుల జట్టులో ఆర్‌ కార్తికేయ, ఎం శివశంకర్‌, వి వెంకటేశ్వర్లురెడ్డి, డి కౌశిక్‌, బాబు, కె హర్షవర్ధన్‌ జిల్లా జట్టులో ఎంపికయ్యారు. మహిళా జట్టులో బి జాస్మియా, పి జాహ్నవి, ఎల్‌ నికిత, బి పద్మ, బి కృప ఎంపికయ్యారు. ఈ క్రీడాకారులు ఈ నెల 20, 27వ తేదీ తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీల్లో పాల్గొంటారని జిల్లా సెక్రటరీ ఎన్‌టి ప్రసాద్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ కె శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

➡️