వైసిపి అభ్యర్ధుల బైక్‌ ర్యాలి : పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి, ఎంఎల్‌ఎ అభ్యర్ధి రాంబాబు

ప్రజాశక్తి – మార్కాపురం
వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంఎల్‌ఎ అభ్యర్ధి అన్నా రాంబాబు కలిసి సోమవారం బైక్‌ ర్యాలి నిర్వహించారు. వైసిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎస్‌వికెపి కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన సభలో చెవిరెడ్డి మాట్లాడారు. మార్కాపురం ప్రాంతంలో వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. వైద్య సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. డాక్టర్ వైఎస్‌ఆర్‌ వెలుగొండ ప్రాజెక్టును 60 శాతం పూర్తి చేశారని అన్నారు. అందులో ఎక్కువ శాతం పనులను సీఎం జగన్మోహన్‌రెడ్డి పూర్తి చేశారని అన్నారు. శ్రీశైలం డ్యాంకు నీరు ఎప్పుడు వచ్చినా వెలుగొండ జలాశయంలో నీరు ఉంటుందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని ఏనాడూ టిడిపి పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ శ్రేణులు ఐక్యతతో ఒంగోలు ఎంపీగా తనను, మార్కాపురం ఎమ్మెల్యేగా అన్న వెంకట్ రాంబాబును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎంఎల్‌ఎ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి, ఎపీఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి, వైసిపి ఎర్రగొండపాలెం పరిశీలకులు వెన్న హనుమాన్ రెడ్డి పాల్గొన్నారు.

➡️