జాతీయస్థాయి క్రీడా పోటీలకు చరణ్ తేజ ఎంపిక

Apr 12,2025 13:20 #Prakasam District

ప్రజాశక్తి-కదిరి: కదిరి బాబురావు ఉద్యాన కళాశాల లో మొదటి సంవత్సరం చదువు తున్న చరణ్ తేజ ఇటీవల ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో రాణించి మే నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో జరిగే జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. మే నెల రెండవ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఉద్యాన విశ్వవిద్యాలయం తరపున చరణ్ పాల్గొంటాడు. శనివారం చరణ్ తేజను సెక్రెటరీ& కరస్పాండెంట్ కదిరి పార్థసారథి అభినందించి జాతీయ స్థాయి క్రీడలలో రాణించి కళాశాలకు పేరు తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ పి వీరన్న గౌడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సుస్మిత, ఉప సర్పంచ్ టి బాబురావు, డి మాలకొండయ్య, రమణయ్య, రహిమాన్, ఖాసీం భాష, విద్యార్దులు, తదితరులు పాల్గొన్నారు.

➡️