స్ట్రాంగ్‌ రూముల్లోకి ఈవీఎంలు

May 15,2024 00:40

స్ట్రాంగ్‌ రూమ్‌కు సీల్‌ వేస్తున్న అధికారులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
నరసరావుపేట మండలంలోని కాకాని పంచాయితీ పరిధిలో గల జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో ఈవీఎంలను భద్రపరిచే ఏర్పాటును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ మంగళవారం పరిశీలించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు బూరే సర్వేశ్వర నరేంద్ర, శ్రీహరి ప్రతాప్‌ సింగ్‌ షాహితో కలిసి పరిశీలించిన అనంతరం స్ట్రాంగ్‌ రూములకు సీలు వేశారు. జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌, ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ పాల్గొన్నారు.పటిష్ట బందోబస్తు : ఎస్పీప్రజాశక్తి-పల్నాడు జిల్లాసార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం ముగిసిన అనంతరం ఇవిఎంలను మంగళవారం తెల్లవారుజామున నరసరావుపేట మండలం కాకాని గ్రామ పరిధిలోని జెఎన్‌టియు కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూముకు తరలించి రూముకు సీల్‌ వేశామని, ఈ ప్రక్రియను ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ బూరే సర్వేశ్వర్‌ నరేంద్ర, పల్నాడు జిల్లా ఎన్నికలాధికారి, జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ సమక్షంలో చేశామని పల్నాడు ఎస్పీ జి.బిందుమాధవ్‌ అన్నారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి, తగిన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆయా గ్రామాల్లో జరిగిన గొడవలకు సంబంధించి, మళ్లీ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఆయా గ్రామాలు, వార్డుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు వారు అందరూ సంయమనం పాటించాలని, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు.

➡️