10న ఒంగోలు కలెక్టరేట్ వద్ద మహాధర్నా

Jan 8,2025 12:32 #Prakasam District

ప్రజాశక్తి-కొండపి : కొండేపి మండలంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని. రాష్ట్ర ప్రభుత్యం పేద వారి సొంత ఇంటి కళ నెరవేర్చాలని, కోరుతూ ఈనెల 10వ తేదిన సిపిఐ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుగుతున్న మహాధర్నాలో పాల్గొనాలని సిపిఐ కొండేపి నియోజకవర్గ కార్యదర్శి కె వీరారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కొండేపి మండలంలోని ముప్పవరం గ్రామంలోని ఇల్లు లేని పేదలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజల సంక్షేమం పక్కన పెట్టికార్పొరేట్ కంపెనీలకు రాయితీలు పేదల నెత్తిన భారాలు మోపి,రకరకాల పద్ధతులతో ప్రజలను ఇబ్బందులు పెట్టిన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలను రాష్ట్రం లో అమలు చేశారని వివరించారు.గత పాలకులు ప్రజల అభివృద్ధి మరచి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. అందుకే రాష్ట్ర ప్రజలు సరైన సమాధానం చెప్పారని విమర్సించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చినాక ఒక మాట మాట్లాడు తుంది. ప్రజలపై భారలు మొపే పనిలో భాగంగా కరెంట్ బిల్లులు పెంచింది. దళిత, గిరిజన కాలనీ లకు 300యూనిట్ ల వరకు ఫ్రీ కరెంట్ ఎత్తి వేసినది, పిల్లలు చదువు లకు ప్రవైట్ స్కూల్స్ లలో ఫీజులు కట్టలేక అద్దె ఇండ్లకు బాడుగలు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాజకీయ నాయకులు వారి వారి విధానాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. వేల మందికి సొంత ఇండ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) అధ్యర్యంలో అర్హులైన అందరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద జనవరి 10తేదీ జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలనీ కోరారు. కార్యక్రమంలో సిపిఐ కొండేపి మండల కార్యదర్శి ఆర్ లక్ష్మి, రమణ, రసూల్ బి, ఈశ్వరమ్మ, శ్రీను, కమల, సుజాత మొదలగువారు పాల్గొన్నారు.

➡️