సమస్య లు పరిష్కరించాలని సిపిఎం ధర్నా
ప్రజాశక్తి-ఒంగోలు : ఒంగోలు నగరంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని. వాటికి అవసరం అయిన నిధులు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. మార్చి 8నుంచి 17 వరకు సిపిఎమ్ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నగర కార్యదర్శి వర్గ సభ్యులు తంబి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ కె మాబు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా ఉన్నాయని ఆరోపించారు. దశాబ్దాలుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో నాయకులు జి రమేష్, రమాదేవి, కల్పన, ఎస్ డి హుస్సేన్, టి మహేష్,కె శ్రీనివాసరావు,దామా శ్రీనివాస రావు, టి భక్తసింగ్ రాజు, కె విశ్వ సేన్, ఎస్ ఇంద్రజ్యోతి, బాలచంద్రం, మాలకొండయ్య నగరంలోని పలు కాలనీలకు చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు.