ప్రజాశక్తి-ప్రకాశం: ప్రకాశం జిల్లా శిoగరాయకొండ జాతీయ రహదారి మీద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఉదయం 5:00 సమయంలో జీవీఆర్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ మీద తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఎంటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన స్థలాన్ని ఎస్సై బీ మహేంద్ర హైవే పెట్రోలింగ్ వాహనం సిబ్బంది పరిశీలించారు.