ప్రజాశక్తి-కొండపి : కొండపి గురుకుల పాఠశాలలో అట్టహాసంగా జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా హాజరై ప్రారంభించారు. సైన్స్ ఫెయిర్ సోమ, మంగళవారాలు జరుగనున్నది. తమలోని ప్రతిభను చాటేలా విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించారు. బాల్య దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ పిలుపునిచ్చారు.