ద్విచక్ర వాహన దారుడి నిర్లక్ష్యంతో ప్రమాదం
కారు మూడు పల్టీలు కొట్టడంతో ఒకసారిగా డిప్రెషన్ కి లోనైన తాసిల్దార్ దంపతులు
ప్రజాశక్తి-పొదిలి : తన ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్యంతో మార్కాపురం తహసీల్దార్ వాహనం ప్రమాదానికి గురైంది. మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తున్న తాసిల్దార్ చిరంజీవి దంపతులు ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో అగ్రహారం దాటిన తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలం వద్ద ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు ఒకసారి రైట్ కి తిప్పడంతో అతని ప్రాణాలు కాపాడే క్రమంలో తాసిల్దార్ చిరంజీవి సడన్ బ్రేక్ కొట్టారు. దీంతో పవర్ స్టీరింగ్ తో ఉన్న కారు మూడు పల్టీలు కొట్టి పక్కన పడింది. ఈ సంఘటనలో తాసిల్దార్ దంపతులకు ఎటువంటిగాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. ద్విచక్ర వాహన దారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించకుండా, వెనుక వస్తున్న వాహనాన్ని గమనించకుండా అవగాహన రాహిత్యంతో మోటార్ సైకిల్ నడపడం ప్రమాదానికి కారణం అయింది. అనుకోకుండా జరిగిన ఘటనతో ఒక్కసారిగా డిప్రెషన్ కి గురైన తాసిల్దార్ దంపతులకు స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని చికిత్స పొందుతున్నారు.