ప్రజాశక్తి-శిoగరాయకొండ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం శిoగరాయకొండ మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ఆర్ సెంటర్ వద్ద కొండేపి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల అలంకరణ కేక్ కటింగ్ జండా ఆవిష్కరణ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శిoగరాయకొండ మండల నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ పార్టీ ఎలా ఆవిర్భావం జరిగింది. గత 15 సంవత్సరాలలో మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సేవ చేయటం కొరకు వారి సమస్యలు పరిష్కారం కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా కృషి చేసిందో వివరించడం జరిగింది.వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
