ఈ పంట డ్రాప్‌ లిస్టు ఏర్పాటు : వ్యవసాయాధికారి ప్రసాద్‌, రైతులు

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : మండలంలో ఈపంట లిస్టు సోమవారం సరిపల్లి రైతు సేవా కేంద్రంలో గణపవరం గణపవరం వ్యవసాయాధికారి వై ప్రసాద్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … మండలంలో ఉన్న 20 రైతు సేవా కేంద్రాలలో పంట లిస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జాబితా పై రైతు సేవా కేంద్ర పరిదిలో ప్రతీ గ్రమంలో గ్రామ సభ ఏర్పాటు చేసి జాబితాలో వివరాలు రైతులకు చదివి వినిపిస్తామని తెలిపారు. జాబితాలో ఏదైనా పొరపాటులు ఉంటే సంబదిత రైతు సేవా కేంద్రాల సిబ్బందికి రాత పూర్వకంగా తెలియజేయాలని అన్నారు. రైతులు వేసిన వరి పంట ఈ పంటలోని వరిపంట ఒకే విధంగా ఉండాలని అన్నారు జాబితాలో తప్పులు సరిచేయటానికి ఈ నెల 10న గ్రీవెన్సు మాడ్యూల్‌ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఆఖరి లిస్టులు ఈనెల 23 న స్థానిక రైతం సేవా కేంద్రాలలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

➡️