ప్రతిభా పురస్కారం అందజేత

Jun 10,2024 21:44
ఫొటో : నగదు పురస్కారం అందజేస్తున్న నాయకులు

ఫొటో : నగదు పురస్కారం అందజేస్తున్న నాయకులు
ప్రతిభా పురస్కారం అందజేత
ప్రజాశక్తి-కావలి : కావలి 39వ వార్డులో నివసిస్తున్న పెయింటర్‌ కాలేషా కుమార్తె ‘రేష్మా’కు ఇంటర్మీడియేట్‌లో 921/1000 మార్కులు సాధించిన సందర్బంగా పెదరాలైన ఆమెకు కావలి నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రూ.10వేలను పురస్కారంగా అందజేశారు. కాగా విద్యార్థిని కావలి నారాయణ కాలేజీలో చదివింది.ఉన్నతమైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థినికి సహాయం చేసేందుకు బాలయ్య బాబు అభిమానులు ఆమెను నారాయణ కాలేజీలో ఫీజులు లేకుండా డిగ్రీ కోర్స్‌లో కూడా చేర్పించారు. తమ అభిమాన హీరో నందమూరి బాలకష్ణ హ్యాట్రిక్‌ ఎం.ఎల్‌.ఎ.గా హిందూపురంలో గెలుపొందిన సందర్భంగా, అయన జన్మదినం రోజున పేద విద్యార్థినికి ప్రతిభా పురస్కారం అందజేశామని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు జ్యోతి బాబురావు తెలిపారు. కాగా విద్యార్థినికి కావలి నూతన ఎం.ఎల్‌.ఎ. దగ్గుమాటి వెంకట (కావ్య) క్రిష్ణారెడ్డి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు చవల రామకృష్ణ, గుత్తికొండ కిషోర్‌బాబు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, అక్కిలిగుంట సూర్యప్రకాష్‌రావు, బొల్లా వేణు, చంద్రశేఖర్‌, ఆత్మకూరి నాగరాజు, చిట్టబత్తిన మాల్యాద్రి, పొట్లూరు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

➡️