ముందస్తు సంక్రాంతి వేడుకలు

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ : గ్రామీణ ప్రాంతంలో నిర్వహించే సంక్రాంతి వేడుకల గురించి నేటి తరం చిన్నారులకు అవగాహన కల్పించేందుకు ముందస్తు సంక్రాతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాయల్‌ విద్యాసంస్థల అధినేత పేరం రవీంద్రబాబు తెలిపారు. రాయల్‌ పయనీర్‌,రాయల్‌ హైస్కూల్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, విద్యార్థిని, విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. విద్యాసంస్థల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ పేరం రవీంద్ర బాబు,పేరం స్వప్న, ఇన్‌ఛార్జి కుడారి మధుబాబు సంక్రాంతి పండుగ విశిష్టతను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్‌ ప్రధానోపా ధ్యాయుడు డివి.బాలసుబ్రమణ్యం,రాయల్‌ పయనీర్‌ ప్రిన్సిపల్‌ బి.రాధిక,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మార్టూరు : మండల పరిధిలోని బబ్బేపల్లి, పాఠశాలలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. విద్యార్థులకు గాలి పటాలు ఎగుర వేసే పోటీలు నిర్వహించారు. కొల్లూరు : కొల్లూరు లోని శ్రీసాయి వాసవీ విద్యాసంస్థలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా భోగిమంటలు వేశారు. అనంతరం విద్యార్థినులు సంక్రాంతి ముగ్గులు వేశారు. ఓ విద్యార్థి హరిదాసు పాత్రలో అలరించాడు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ డైరెక్టర్‌ ఉప్పు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు చీరాల: చీరాల పట్టణంలోని ముత్యాల పేట-1,గొల్ల పాలెం, కటకల వారి వీధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల తలలపై భోగి పళ్ళు పోశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ కవిత, 5వ వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి,10వ వార్డు కౌన్సిలర్‌ జి స్వాతి,11 వ వార్డు కౌన్సిలర్‌ టి అనిల్‌, సచివాలయ సిబ్బంది రాజేష్‌, తేజస్విని, అంజమ్మ, అనిత, అంగన్‌వాడీలు కష్ణకుమారి,జయలక్ష్మి, భారతి, శారద, మాధవి, సుమశ్రీ పాల్గొన్నారు.

➡️