స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : కలకడ మండలంలో సంక్రాంతి వేడుకలను ముందస్తుగా ప్రారంభించారు. శుక్రవారం మండల కేంద్రమైన కలకడలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రంగు రంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణాన్ని అలంకరించి, భోగి మంటలు వేసి, నాట్యములు చేస్తూ సంక్రాంతి వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగరాజా తెలిపారు. ఈనెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండటంతో ముందస్తుగా పాఠశాలలో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నట్లు తెలిపారు.

➡️