సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం

సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం

ప్రజాశక్తి- భీమునిపట్నం : సభ్యత్వ నమోదులో భీమిలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని టిడిపి యువ నేత గంటా రవితేజ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇటీవల సాధారణ ఎన్నికల్లో భారీ ఓట్ల ఆధిక్యతను సాధించగలిగామో, అదే స్థాయిలో సభ్యత్వ నమోదు ఉండాలని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో టిడిపి నాయకులు డిఎఎన్‌ రాజు, గాడు వెంకటప్పడు, గంటా నూకరాజు, మొల్లి లక్ష్మణరావు, కె దామోదరరావు, దాసరి శ్రీనివాస్‌, గాడు చిన్ని కుమారి లక్ష్మి పాల్గొన్నారు

సమావేశంలో మాట్లాడుతున్న గంటా రవి తేజ

➡️