నైపుణ్య గణనకు సిద్ధం కండి : జెసి

Oct 29,2024 22:12

ప్రజాశక్తి-విజయనగరంకోట : నైపుణ్య గణన-2024 నిర్వహించేందుకు సిద్ధం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌ ఆదేశించారు. స్కిల్‌ సర్వే నిర్వహణకు మండలాల నుంచి ఎంపిక చేసిన మాస్టర్‌ ట్రైనర్లకు స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ త్వరలో నిర్వహించబోయే ఈ నైపుణ్య గణనకు అన్నివిధాలా సంసిద్ధులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందన్నారు. నిబంధనలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని, ఇంటింటికీ సర్వే కోసం వెళ్లినప్పుడు ఈ గణన అవసరాన్ని యువతకు వివరించి, వారి దగ్గర నుంచి వివరాలను సేకరించాలని సూచించారు. దీనికి సంబంధించిన యాప్‌ లో అప్లోడ్‌ చేయాల్సిన అంశాలపై సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాధికారి జి.ప్రశాంత్‌ కుమార్‌, జిల్లా ఉపాధి అధికారి, డి.అరుణ, రాష్ట్రస్థాయి మాస్టర్‌ ట్రైనర్‌ పృద్వి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా బాధ్యులు అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. నవభారత్‌ సాక్షరత కార్యక్రమం విజయవంతానికి కలసి పనిచేయాలి

➡️