క్రీడా దుస్తులు అందజేత

ప్రజాశక్తి-బాపట్ల : యువత క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ప్రముఖ వ్యాపారవేత్త గోపాళం వెంకటేశ్వర్లు (బుజ్జి) తెలిపారు. 34వ సబ్‌ జూనియర్స్‌ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు పులివెందుల వెళ్తున్న గుంటూరు ,బాపట్ల జిల్లాలకు చెందిన 28 మంది క్రీడాకారులకు బుధవారం క్రీడా దుస్తులు అందజేశారు. ఈ సందర్భంంగా బుజ్జి మాట్లాడుతూ నేటి సమాజంలో యువత క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి సుబ్బరాజు , సాంబు ,కత్తి శ్రీను, పూల నాగేశ్వరరావు, సాయి ,అక్కి శ్రీను,విజరు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు .

➡️