నులిపురుగుల నివారణ – ఆల్బండాజోలు మాత్రల పంపిణీ

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (కోనసీమ) : కపిలేశ్వరపురం మండలంలోని అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కళాశాలలో, ఉన్న 1-19సం. వయస్సు గల చిన్నారులకు, విద్యార్థులకు, వైద్యాధికారుల పర్యవేక్షణలో సోమవారం నులిపురుగుల నివారణకు ఆల్బండాజోల్‌ మాత్రలు మింగించడం జరిగిందిమా. ఈ సందర్భంగా 3,783 పిల్లల లక్ష్యం కాగా 3,679 మందికి మింగించి 97.8 శాతం పూర్తి చేసినట్లు ఎంపీహెచ్‌ఈఓ జె మల్లికార్జునుడు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బి రామారావు, లు తెలిపారు. మిగిలిన వారికి ఈ నెల 17వ తేదీన మాఫ్‌ అప్‌ రౌండ్‌ లో మాత్రలను మింగించి 100 శాతం పూర్తి చేస్తామని వైద్యాధికారిని డా. రత్నకుమారి తెలిపారు. ఈ కార్యక్రమం హెచ్‌ వి టి మేరీమణి, ఏ ఎన్‌ ఎం లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️