ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి మండలం వంగపాడు, గురువాజిపేట రైతుసేవా కేంద్రాల పరిధిలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పి జ్యోత్స్నదేవి నిర్వహించారు. ముందుగా రైతుల పొలాలను పరిశీలించి తదుపరి గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక సహాయకులు షేక్ రేష్మ, వ్యవసాయ సహాయకులు షేక్ ఆశిషా, ఏ మనీషా, వంగపాడు, గురువాజీ పేట రైతులు పాల్గొన్నారు. తాళ్లూరు: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించాలని తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని దోసకాయల పాడు, లక్కవరం గ్రామాలలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు కందిలో సస్యరక్షణ చర్యలను గురించి వివరించారు. అదేవిధంగా జొన్న పంటలో కూడా వచ్చే తెగులు గురించి వివరించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి రాంబాబు, పశువులలో గర్భధారణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కోటా శివలక్ష్మి, విఏఏలు భార్గవి, వీరాంజనేయులు, వెటర్నరీ అసిస్టెంట్లు మనీషా, అంకయ్య, రైతులు సత్యం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పీసీపల్లి: పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండలంలోని గుంటుపల్లి సచివాలయం పరిధిలోని మూలవారిపల్లెలో రైతులకు అవగాహన కల్పించారు. కంది పంటలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. వ్యవసాయ శాఖలో ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కనిగిరి ఏడి ఈవి రమణ, వ్యవసాయ శాఖ ఏవో టెక్నికల్ శ్రీనివాసరావు, పీసీపల్లి ఏఒ షారుక్, ఇంచార్జ్ ఎంపీడీవో డివి రమణారెడ్డి, ఏఈఓ పుల్లయ్య, విఏఏలు సుస్మిత, మనోహర్, రైతులు పాల్గొన్నారు.