ప్రజాశక్తి – కడప : దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన యముడీ పాలన వలె కొనసాగుతోందని , కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసు కుంటోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్ లో నీ మహాకుంభమేళాలో అక్కడి బిజెపి ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వేల మంది ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుణ్య స్నానాలు చేసిన భక్తుల సంఖ్యను ప్రకటించిన ప్రభుత్వం, అక్కడి మృతుల సంఖ్యను దాచిపెట్టి శవాలను నిర్మానుష్య ప్రదేశాల్లో పారావేసిందని ఆరోపించారు. తాజాగా ప్రయాగ రాజ నుంచి న్యూఢిల్లీ చేరుకున్న యాత్రికులు, ప్రజలు ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిస లాటలో అమాయక ప్రజలు పదుల సంఖ్యలో చనిపోయా రన్నారు. ఈ హృదయ విదారక అపార ప్రాణా నష్టానికి ఢిల్లీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హౌం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ యోగి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మహా కుంభమేళా నిర్వహణ, సౌకర్యాల కల్పనలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలైన మత విద్వేష భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. కేవలం విఐపి లకు మాత్రమే గొడుగు పడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సామాన్య ప్రజలను ప్రాణాలు బలి ఇస్తున్నారని ఆరోపించారు. హిందూ మతం పేరుతో ప్రజల ఓట్లు కొల్లగొట్టే ఈ మత విద్వేషకుడు అదే హిందువుల ప్రాణాలను బలిగొంటున్నాడని విమర్శించారు. కుంభమేళా పూర్తయ్యేలోగా పుణ్యం మాటేమో గానీ ప్రాణాలు దక్కే పరిస్థితి కరమైందన్నారు. ప్రధాని యమోడి ప్రభుత్వం కుంభమేళా ఏర్పాట్లు , రవాణా సౌకర్యాలు, ప్రజల భద్రత విషయంలో ఘోరంగా విఫలమైందని భజమెత్తారు. ఈ హఅదయ విదారక సంఘటనలు మత విద్వేషకుల దుర్మార్గపు పాలనను స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు. కేవలం మతవిద్వేషాలు సృష్టించి, హిందువులను తమ వైపుకు తిప్పుకొని ఓట్లు దండు కోవడం మినహా వారికి రక్షణ కల్పించడాన్ని పూర్తిగా ఈ పాపాల భైరవుడు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. హిందూ మతం పేరుతో మతోన్మాదుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హౌం మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ విష్ణు మోహన్ భగవత్ ,ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఇతర ఆర్‌ఎస్‌ఎస్ నేతలు దేశాన్ని రక్తపుటేరులతో ముంచెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట, కుంభమేళాలో తొక్కిసలాటలో వందలు, వేలాదిమంది అభాగ్యులు దుర్మరణం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చేతకాని, అసమర్ధ, దద్దమ్మ ప్రధాని యమోడి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మిగిలిందని ఎద్దేవా చేశారు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలందరూ మరో స్వాతంత్ణ్ర సమరానికి సన్నద్ధం కావాల నీ పిలుపునిచ్చారు.
ప్రధాని యమోడీ పాలన ‘ మహా ‘ ప్రాణ నష్టం : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్
