”సురుచి” ని సందర్శించిన ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

ప్రజాశక్తి, మండపేట (కోనసీమ) : తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హోదా కలిగిన, తమిళనాడు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ టిఎన్‌ వెంకటేష్‌ శనివారం తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ ని సందర్శించారు. సురుచి పీఆర్వో వర్మ , జనరల్‌ మేనేజర్‌ శంకర్‌ లు ఆయనకు స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వర్మ ఆయనకు సురుచి ఘనతను వివరించారు. ఆయన ఎంతో ఆసక్తిగా కాజా గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్మ , శంకర్‌ ఆయనను గౌరవ పూర్వకంగా శాలువాతో సత్కరించి సురుచి హనుమాన్‌ చిత్ర పటాన్ని, బాహుబలి కాజాను , సురుచి మిఠాయిలను బహూకరించారు.

➡️