ప్రజాశక్తి- కడప ప్రతినిధిప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్క రించడమే ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి ఉద్యోగీ తప్పనిసరిగా ఇకెవైసి చేయించుకోవాలి. దీంతోపాటు జిల్లాలోని డ్రాయింగ్ ఆఫీసర్లు తమ శాఖల పరిధిలోని అకౌంట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. సిఎఫ్‌ఎంఎస్ అమలు నేపథ్యంలో ట్రెజరీ అధికారులపై అదనపు భారం పడింది. దీనికితోడు ఆర్టీసీ ఉద్యోగులు సైతం ట్రెజరీ పరిధిలోకి రావడంతో భారం రెట్టింపైంది. దీనికితోడు వైద్య ఆరోగ్యశాఖ కూడా ప్రభుత్వ పరిధిలో రానున్న నేప థ్యంలో మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోందని పేర్కొంటున్న ట్రెజరీస్ డిడి ఎం.ఎస్ వెంకటేశ్వ ర్లుతో ప్రజాశక్తి ముఖాముఖి…టెజరీ కార్యాలయాల పనులేమిటి? జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాలు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల చెల్లింపులు, వాటి రికార్డులను నిర్వహించడం, కొత్తగా చేరిన ఉద్యోగులకు ఐడి, ఇతర రికార్డులను నిర్వహించడం, పీడీ అకౌంట్ల నిర్వహణ, స్ట్రాంగ్‌రూమ్ నిర్వహణ, ఆప్కోస్, కాంట్రాక్టు, క్లాస్- 4 ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది.సబ్‌ట్రెజరీ కార్యాలయాల వివరాలు తెలపండి. జిల్లాలో తొమ్మిది సబ్‌ట్రెజరీ కార్యాలయాలున్నాయి. కడప, జమ్మల మడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ముద్దనూరు, కమలాపురం, పులివెందుల, బద్వేల్, సిద్ధవటం, ప్రాంతాల్లో ఉన్నాయి.ఇకెవైసి నమోదు ఎలా ఉంది? ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఇకెవైసిపి చేయించుకోవాలి. ఇప్పటివరకు ఉద్యోగులు 99 శాతం, పెన్షనర్స్ 99 శాతం నమోదు చేశాం. కొత్తగా చేరిన ఉద్యోగులు సైతం ఇకెవైసిపి చేయించుకోవాలి.ఉద్యోగుల వివరాలు తెలపండి? జిల్లాలో 22 వేల మంది ఉద్యోగులు, 18 వేల మంది పెన్షనర్స్ ఉన్నారు. ప్రతి నెలా సదరు ఉద్యోగుల జీత భత్యాల, పెన్షన్స్, వంటి ఇతర చెల్లింపులు ప్రక్రియ నడు స్తోంది. వీటితోపాటు రిటైర్డు ఉద్యోగుల బకా యిలు, గ్రాట్యూటీ చెల్లింపులను చేయడం గమనార్హం.ట్రెజరీ చెల్లింపుల గురించి తెలపండి? ప్రతిఏటా ట్రెజరీశాఖ ద్వారా రూ.514 కోట్లు మేర ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు సంబందించి పెన్షన్ల రూపంలో చెల్లింపులు చేయడం జరుగుతోంది.పీడీ అకౌంట్లు కలిగిన డిపార్టుమెంట్లు ఎన్ని? జిల్లాలో 10 శాఖల వరకు ఉన్నారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ, డ్వామా, స్పోర్ట్‌స్కూల్, యూనివర్శిటీ, ఆర్కిటెక్షర్ యూనివర్శిటీ సహా ఇతర శాఖల పరిధిలోని ఉద్యో గులు ఉన్నారు. వీటి పరిధిలోని ఉద్యోగు లకు పిడీ అకౌంట్ల ద్వారా జీతభత్యాలు చెల్లింపులు చేయడం జరుగుతుంది.ఆప్కోస్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది? ఆప్కోస్ కింద 3,600 మంది, ఔట్‌సోర్సింగ్ కింద 1100, కాంట్రాక్టు ఉద్యోగులు 2,000 మంది వరకు ఉన్నారు.